ఏపీసెట్ అనర్హత అభ్యర్థులకు శుభవార్త

21 Feb, 2014 04:22 IST|Sakshi

ఉత్తీర్ణత శాతం పెంపునకు యూజీసీకి సిఫార్సు
 హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీ సెట్-2013లో అనర్హత అభ్యర్థులకు శుభవార్త. ఉత్తీర్ణత శాతాన్ని మరో ఐదు శాతం పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. గురువారం ఏపీసెట్ సభ్యకార్యదర్శి సాక్షితో మాట్లాడుతూ గతంలో యూజీసీ నిబంధనల మేరకు 3 పేపర్లలో అత్యధిక మార్కులు (టాపర్స్) సాధించిన అభ్యర్థుల్లో 15 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు.
 
  దీంతో తాజాగా విడుదల చేసిన ఏపీసెట్ ఫలితాల్లో 6,267 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇంత తక్కువ ఫలితాల వల్ల మంచి మార్కులు సాధించిన అనేకమంది శ్రమ వృథా అవుతుందని ఏపీసెట్ అధికారులను అభ్యర్థులు కోరగా వారి విజ్ఞప్తుల మేరకు ఉత్తీర్ణత శాతాన్ని మరో ఐదు శాతం పెంచేందుకు ఏపీసెట్ చైర్మన్, ఓయూ ప్రొ.సత్యనారాయణ యూజీసీ అధికారులకు సిఫార్సు చేసినట్లు సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు యూజీసీ అంగీకరిస్తే 3 సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణతను సాధించిన 2 వేలలోపు అభ్యర్థులు ఏపీసెట్-2013లో అర్హత సాధించనున్నట్లు  చెప్పారు.

మరిన్ని వార్తలు