ఎస్‌ఈబీతో మంచి ఫలితాలు

12 Jul, 2020 05:11 IST|Sakshi

డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ 

సాక్షి, అమరావతి:  అక్రమ మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాల నిరోధానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) మంచి ఫలితాలు సాధిస్తోందని ఏపీ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగింది.  సమావేశంలో తీర ప్రాంత గస్తీ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిజం, ఉగ్రవాద కార్యకలాపాలు, మనుషుల అక్రమ రవాణా, ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది. డీజీపీ సవాంగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశామన్నారు. 

ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించిన డీజీపీ 
మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో ఫైరింగ్‌ రేంజ్‌ను శనివారం సందర్శించిన డీజీపీ సవాంగ్‌.. రాష్ట్ర పోలీసు శాఖ సమకూర్చుకున్న అత్యాధునిక ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించారు.   
► ఇజ్రాయిల్‌ సహకారంతో రూపొందించిన ఆధునిక ఆయుధాలను టెస్ట్‌ ఫైర్‌ చేసి పరిశీలించి, ఐపీఎస్‌ అధికారులకు అందించారు. 
► అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్‌ ప్రాక్టీస్, టెస్ట్‌ ఫైరింగ్‌ కార్యక్రమాన్ని పీఅండ్‌ఎల్‌ నాగేంద్రకుమార్, ఏపీఎస్పీ బెటాలియన్స్‌ ఐజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, ఐజీ ట్రైనింగ్‌ సంజయ్‌ నిర్వహించారు.

మరిన్ని వార్తలు