కృష్ణాష్టమికి గోపాల గోపాల ఫస్ట్ లుక్ !

24 Jul, 2014 13:08 IST|Sakshi
కృష్ణాష్టమికి గోపాల గోపాల ఫస్ట్ లుక్ !

చెన్నై: విక్టరీ హీరో వెంకటేష్ హీరోగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. ఆ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు16వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ గురువారం చెన్నైలో వెల్లడించారు. గోపాల గోపాల చిత్రంలో శ్రీకృష్ణుడు కీలక భూమిక పోషిస్తాడని.. ఈ నేపథ్యంలో ఆయన  జన్మదినమైన కృష్ణాష్టమి రోజున ఆ చిత్రం ఫస్ట్లుక్ విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్ల డైలాగ్లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 25 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు.

హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రం కిషోర్ కుమార్ దర్శకత్వంలో గోపాల గోపాల రీమేక్ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్, పరాష్ రావెల్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ రోజున గోపాల గోపాల చిత్రం విడుదలకు సిద్దమతుంది. 

మరిన్ని వార్తలు