ఆ విషయంలో ఏపీ రెండో స్థానం : ద్వివేది

7 Apr, 2019 17:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : దేశంలో ఎన్నికల వేడి రగులుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ హీట్‌ తారాస్థాయికి చేరుకుంది. ఏప్రిల్‌ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి (ఏప్రిల్‌ 9) సాయంత్రం ఆరుగంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. దేశంలో భారీగా నగదు పట్టుబడిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏపీలో 105 కోట్ల నగదు, వంద కేజీల బంగారం, 22 కోట్ల విలువైన లిక్కర్‌ పట్టుబడిందని తెలిపారు. 

గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి వంద కంపెనీల బలగాలు తక్కువగా వచ్చాయన్నారు. సమస్యాత్మక ప్రాంతంలో కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిఘా పెడుతున్నామన్నారు. అరకు, పాడేరు వంటి నియోజకవర్గాలు, రిమోట్‌ ప్రాంతాల్లోని 14 పోలింగ్‌ స్టేషన్లను పట్టణ ప్రాంతాలకు మార్చామని అన్నారు.

మరిన్ని వార్తలు