తల్లీకూతుళ్లను కబళించిన మృత్యువు

21 Sep, 2015 03:12 IST|Sakshi
తల్లీకూతుళ్లను కబళించిన మృత్యువు

పుత్తూరు రూరల్ : కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తల్లీకూతుళ్లను కబళించిం ది. మరో ఇద్దరు వ్యక్తులు క్షతగాత్రులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి-చెన్నై జాతీయ రహదారి శిరుగురాజుపాళ్యం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా... చంద్రప్పనాయుడు కండ్రిగకు చెందిన జానకమ్మ(45), ఆమె కుమార్తె మునిలక్ష్మి(20) ఆ గ్రామ సమీపంలోని ఓ దాబా హోటల్‌లో పని చేస్తున్నారు. మధ్యాహ్నం పని ముగించుకుని జాతీయ రహదారి మీదుగా స్వగ్రామానికి బయలుదేరారు. శిరుగురాజుపాళ్యం దళితవాడకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా అదే దారిలో వెళుతున్నారు.

ఆ సమయంలో పుత్తూరు వైపు నుంచి తిరుపతికి వెళుతున్న ఓ కారు(ఏపీ 03ఏడబ్ల్యూ 4067) రోడ్డు పక్కన నడిచి వెళుతున్న శిరుగురాజుపాళ్యంకు చెందిన హరికష్ణ(25), గురవయ్య(30) వేగంగా ఢీకొంది. దీంతో వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వెనువెంట నే జానకమ్మ, మునిలక్ష్మిని కారు ఢీకొం ది. దీంతో వారిద్దరూ రోడ్డు పక్కన బ్రిడ్జి కిందకు ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి మరో కూతురు సౌందర్య, కుమారుడు దినేష్ ఉన్నారు. వీరిద్దరూ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. భర్త ఐదేళ్ల క్రితం చనిపోవడంతో జానకమ్మ దాబా హోటల్‌లో పని చేస్తూ పిల్లల్ని పోషిస్తుండేది. అమ్మ, అక్క మృతితో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. మృతదేహాలను పట్టుకుని బోరున విలపించా రు. వీరి ఆర్తనాదాలతో ఆస్పత్రి ఆవరణలో విషాదం నిండి పోగా, చూసిన వారు కళ్లు చెమ్మగిల్లాయి.

 మృతుల బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో
 పరారైన కారు డ్రైవర్‌ను వెంటనే అరె స్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, మృతుల బంధువులు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు, పుత్తూరు ఎస్‌ఐ హనుమంతప్ప, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని బం ధువులు, గ్రామస్తులతో చర్చించారు. మృతుల కుటుంబానికి న్యాయం చేసే లా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు  హరి కృష్ణ, గురవయ్యను 108 వాహనంలో పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వీరి పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు