బినామీ ‘బాబు’కు చెక్‌ 

4 Jul, 2020 08:22 IST|Sakshi

టీడీపీ హయాంలో భాస్కర్‌నాయుడిదే హవా 

కాంట్రాక్టు కార్మికులపై పెత్తనం ఆయనదే 

ఆనాటి ఆగడాలను గుర్తుచేసిన సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, తిరుపతి : బినామీ బాబుల శ్రమ దోపిడీకి  ప్రభుత్వం చెక్‌ పెట్టింది. చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా అక్రమాలకు ఏజెన్సీ నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసింది. శుక్రవారం ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తూ కాంట్రాక్టర్‌ భాస్కర్‌నాయుడు అవినీతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో  కార్మికుల కష్టం దళారీ పాలుకావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వారికి నెలవారీ వేతనాలు సక్రమంగా అందించేందుకే కార్పొరేషన్‌ను ప్రవేశపెట్టామని వెల్లడించారు. 

కాంట్రాక్ట్‌ ఉద్యోగాలన్నీ కట్టబెట్టేశారు 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, యూనివర్సిటీలు, ఆస్పత్రుల్లో పారిశుధ్య కారి్మకుల కాంట్రాక్టులన్నీ పద్మావతి సంస్థ పేరుతో భాస్కర్‌నాయుడే దక్కించుకున్నారు. ఉద్యోగులకు కనీసం టైంస్కేల్‌ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. పద్మావతి హౌస్‌ కీపింగ్‌ సంస్థ తీరుపై కారి్మకుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇష్టారాజ్యంగా సిబ్బందిని తొలగించడం, వేతనాల్లో కోత వేయడం వంటి చర్యలతో పలుమార్లు కారి్మకులు ఆందోళన బాటపట్టారు. పద్మావతి సంస్థకు వ్యతిరేకంగా రోజుల తరబడి దీక్షలు చేపట్టారు. అయితే ఆ సంస్థ అధినేత భాస్కర్‌నాయుడుకి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో దగ్గర సంబంధాలు ఉండడంతో అధికారులెవరూ నోరెత్తలేదు. ఒకప్పుడు టీటీడీకి సంబంధించిన కాటేజీల్లో పలు సంస్థలు పారిశుధ్య పనులు నిర్వహించేవి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం భాస్కర్‌నాయుడు సంస్థ ఆక్రమించింది. నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే భాస్కర్‌నాయుడుకి టీటీడీ అధికారులు అనుకూలంగా వ్యవహరించారని కారి్మకులు చెబుతున్నారు.

వందల కోట్ల కాంట్రాక్టులు 
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను భాస్కర్‌నాయుడు దక్కించుకున్నారు. వంద మంది చేయాల్సిన పనిని కేవలం 50 మందితో చేయించి శ్రమదోపిడీకి పాల్పడేవారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో  కార్మికులు తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భాస్కర్‌నాయుడి అవినీతినిపై ఫిర్యాదు చేశారు. కారి్మకుల ఇబ్బందులను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. నాడు వారికి ఇచ్చిన హామీని నేడు నేరవేర్చారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ప్రారంభించారు.   

మరిన్ని వార్తలు