పూర్తిస్థాయి డీజీపీగా ప్రసాదరావు

15 Nov, 2013 02:20 IST|Sakshi
పూర్తిస్థాయి డీజీపీగా ప్రసాదరావు

సాక్షి, హైదరాబాద్: డీజీపీగా బి.ప్రసాదరావు గురువారం రాత్రి పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ నియామకంపై యూపీఎస్సీ ముగ్గురు అధికారుల పేర్లను ఖరారు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ప్రసాదరావును పూర్తిస్థాయి డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు.

వి.దినేష్‌రెడ్డి పదవీ విరమణ అనంతరం ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న ప్రసాదరావుకు ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు డీజీపీగా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే రాత్రి 8 గంటలకు ప్రసాదరావు పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కిరణ్‌కుమార్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

మరిన్ని వార్తలు