ఉద్యోగ భద్రత.. ఎన్నాళ్లీ వ్యథ..!

27 Mar, 2018 11:46 IST|Sakshi

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పట్టించుకోని ప్రభుత్వం

జీఓ నం.27తో మోసం చేశారంటున్న ఉద్యోగులు

నేడు విజయవాడలో కాంట్రాక్ట్‌ హెల్త్‌ ఉద్యోగుల మహాధర్నా

పాలకొల్లు టౌన్‌: బాబు వస్తే జాబు వస్తుంది.. 20 14 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రధాన అంశం. ఇదొక్కటే కాదు ఎన్నో అమలుకాని హామీలను ఇచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత టీడీపీ పాలకులు వీటి అమలును మరిచిపోయారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత, వేతనాలు లేవని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్ట్‌ హెల్త్‌ ఉద్యోగుల విధానాన్ని  2002లో ప్రవేశపెట్టిన చంద్రబాబు ఉద్యోగుల కుటుంబాలకు భద్రత లేకుండా చేశారని ఆరోపిస్తున్నా రు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు మంగళవారం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విజయవాడలోని అలంకార సెంటర్‌లో ధర్నా చేయడానికి పూనుకున్నట్టు యూ నియన్‌ నాయకులు తెలిపారు.

జిల్లాలో వందలాది మంది
జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్‌అసిస్టెంట్‌లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు సుమా రు 500 మంది కాంట్రాక్ట్‌ పద్ధతిలో, సు మారు 10 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉ ద్యోగులు పనిచేస్తున్నారు. 2002లో కాం ట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని అప్పటి సీఎం చంద్రబాబు కమిటీ వేసినా నివేదికను పక్కనపెట్టారని ఉద్యో గులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2004లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంట్రాక్ట్‌ హెల్త్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆయన ఆకస్మిక మృతితో విషయం మరుగునపడిపోయిందన్నారు.
2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పట్టించుకోలేదని వాపోతున్నారు.

జీఓ 27తో నిరాశ
ప్రభుత్వం స్పందించకపోవడంతో కాం ట్రాక్ట్‌ ఉద్యోగులు సుప్రీంకోర్టుçను ఆశ్రయించారు. దీంతో కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని ఉద్యోగ సంఘ నాయకులు  చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో సీఎం చంద్రబాబు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నమ్మించి డిసెంబర్‌లో మంత్రి వర్గ కమి టీ ఏర్పాటు చేయడంతో వేతనాలు పెరుగుతాయని ఆశించగా జీఓ 27న విడుదల చేసి నిరాశకు గురిచేశారని ఉద్యోగులు అంటున్నారు. బేసిక్, డీఏ, హెచ్‌ఆర్‌ఏలను మినహాయించి పర్మినెంట్‌ వేత నం ఇచ్చేలా జీఓ 27 రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్యను సంప్రదించగా విషయాన్ని మంత్రివర్గ కమిటీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారని అసోసియేషన్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్‌ హెల్త్‌ ఉ ద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు