ఉద్యోగులను ఆదుకోవాలి..

21 Nov, 2018 07:59 IST|Sakshi
జగన్‌ను కలిసిన గిరిజన సంక్షేమ శాఖ టీచర్స్‌ యూనియన్‌ సంఘ సభ్యులు, సీఆర్‌టీలు

విజయనగరం: పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నా... గిరిజన సంక్షేమ శాఖలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులకు జీవో నెం 3 ప్రకారం ఉద్యోగాలు వెంటనే కల్పించాలి.  కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న 361 మంది సీఆర్‌టీలను రెగ్యులర్‌ చేయాలి. పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న 55 పాఠశాలల్లో సుమారు 17వేల మంది విద్యార్థులు చదువుతున్నారని,  వసతిగృహ సిబ్బంది లేరు.  దినసరి వేతనాలపై సుమారు 25సంవత్సరాలుగా పనిచేస్తున్న 29మందిని జీవో 212 ప్రకారం రెగ్యులర్‌ చేయాల్సి ఉండగా  ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడందు. మీరు అధికారంలోకి రాగానే పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. –గిరిజన సంక్షేమ శాఖ టీచర్స్‌యూనియన్‌ సభ్యులు, సీఆర్‌టీలు

మరిన్ని వార్తలు