బనగానపల్లె ఆసుపత్రి సామర్థ్యం పెంపు : ఎమ్మెల్యే కాటసాని

26 Sep, 2019 14:59 IST|Sakshi

సాక్షి, కర్నూలు : బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి ఏరియా ఆసుపత్రిగా మారుస్తున్నట్టు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమయ్యే నిధులు రూ. 15 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంజూరు చేశారని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్షన్నర లీటర్ల నీటి సామర్థ్యంతో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆసుపత్రిగా తీర్చిదిద్దే క్రమంలో సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున కాటసాని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు