పెద్దాస్పత్రికి పండగ సెలవలిచ్చారా!

18 Jan, 2014 03:36 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: బడులు, కార్యాలయాలకే కాదు ఆస్పత్రికి కూడా పండగ సెలవులు ఇచ్చారు. కాదు..కాదు తీసేసుకున్నారు. నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి(పెద్దాసుపత్రి)లో పరిస్థితి ఇది. పండగ జరుపుకునేందుకు వెళ్లిన వైద్యాధికారులు, సిబ్బంది మూడు రోజులుగా ఆస్పత్రికి రావడం లేదు. నింపాదిగా కొందరు వస్తుండగా, మరికొందరు ఇంకా సెలవులోనే ఉన్నారు. ఈ క్రమంలో మూడు రోజులుగా పెద్దాసుపత్రి బోసిపోతోంది. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగుల తిప్పలు అన్నీఇన్నీ కావు. పెద్దాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని ఓపీ పూర్తిగా ఖాళీ అవ గా, వందలాది పడకలు సైతం ఖా ళీగా కనిపిస్తున్నాయి. శుక్రవారం కొం దరు వైద్యులు, సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు.
 అంతా నిర్లక్ష్యం: నిబంధనల ప్రకా రం వైద్యశాలలకు సెలవులు ఉండ వు. ఒక వేళ పండగలైనా రోగులు ఇ బ్బంది పడకుండా షిప్టుల ప్రకారం వైద్యులు, సిబ్బందిని నియమించాలి. ఈ విషయంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సి బ్బంది సైతం సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని ఆరోపణలు వి నిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ప ర్యవేక్షణ కరువవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి.
 
 పెద్దాసుపత్రిలో 41 మంది వైద్యాధికారులు, 90 మంది నర్సులు, 16 మంది టెక్నీషియన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నీ వార్డుల్లో కలిపి 250 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో సగానికిపైగా పడకలు ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రోజూ ఔ ట్ పేషెంట్లు 400 నుంచి 500 మంది వరకు వస్తుంటారు. ప్రస్తుతం వైద్యు లు, సిబ్బంది లేకపోవడంతో వంద పేర్లు కూడా నమోదుకావడం లేదు. ఆస్పత్రి ఆవరణ ఖాళీగా కనిపిస్తోంది.
 
 ఈ సీజన్‌లో పేషంట్లు తక్కువే : డాక్టర్ పి. నిర్మల, ఆర్‌ఎంఓ
 నూతన సంవత్సరం, సంక్రాంతి పం డగ రోజుల్లో ఇన్‌పేషెంట్ల సంఖ్య త క్కువగానే ఉంటుంది. పండగ సెంటిమెంట్లతో రోగులు ఆసుపత్రికి రారు.  సిబ్బంది కొరత లేదు. అవసరమైన చోట విధులకు నిత్యం హాజరయ్యేలా సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బందులు చూశాము.
 

>
మరిన్ని వార్తలు