‘స్వర్ణ’ స్థలంపై కబ్జాదారుల కన్ను!

15 Aug, 2014 02:19 IST|Sakshi
‘స్వర్ణ’ స్థలంపై కబ్జాదారుల కన్ను!

 టెక్కలి : ప్రాంతం ఏదైనా ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటేచాలు దాన్ని సొం తం చేసుకోవడానికి చాలామంది పోటీపడుతుంటారు. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమేపీ గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో ఈ పరిస్థితి మరీ ఎక్కువైంది. చిన్న పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో సైతం బంగారం లాంటి పంట పొ లాలను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ భూములపై సైతం కన్నేసి రాజకీయ నాయకు ల అండదండలతో వాటిని కైంకర్యం చేసేం దుకు పావులు కదుపుతున్నారు.
 
 గుట్టు చప్పుడు కాకుం డా వారికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా రు. దీన్ని అరికట్టాల్సిన అధికారులు మౌనంగా ఉంటుం డడంతో కబ్జాదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి రెవెన్యూ డివిజన్ కేంద్రమైన టెక్కలిలో ప్రస్తుతం కనిపిస్తోంది. పాత జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకుని స్వర్ణకారుల సంఘం పేరుతో ఇండస్ట్రియల్ శాఖ ఆధీనంలో ఉన్న స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. రాజకీయ నాయకుల అండతో విలువైన ఈ స్థలాన్ని ఎలాగైన సొంతం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలని కొంతమంది ప్రయత్నాలు ప్రారంభించారు.
 
 విలువైన ఈ స్థలం వివరాలను పరిశీలిస్తే.. 1966 సంవత్సరంలో టెక్కలిలో జగద్దాత్రి స్వర్ణకారుల సొసైటీ కోసం సర్వే నంబర్ 520/1లో 34 సెంట్ల స్థలం, 520/3లో 1.66 ఎకరాల భూమిను ఖాతా నంబర్ 101288 పేరుతో కొనుగోలు చేసుకున్నారు. అప్పట్లో 38 మంది సభ్యులకు మొత్తం 38 వేల రూపాయల రుణాలను మంజూరు చేస్తూ ఈ స్థలంలో సిమెంట్ పైపుల తయారీ పరిశ్రమలను నిర్వహించుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొంతకాలం తరువాత రుణా లు మాఫీ కావడంతో పైపుల తయారీ పరిశ్రమలు కూడా నిలిపివేశారు. ఆ తరువాత సొసైటీ తమ కార్యక్రమాల కు దూరమైంది. ఇదే స్థలంలో కొన్నేళ్లు ఇండస్ట్ట్రియల్ ఇన్‌స్పెక్టర్ కార్యాల యం, మత్స్యశాఖ కార్యాలయాలను నిర్వహించారు. ఆ తరువాత ఆ కార్యాలయాలను కూడా ఇతర ప్రాంతాలకు తరలించేశారు. దీంతో ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా చేయాలని అప్పట్లో కూడా చాలామంది ప్రయత్నించారు. స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చాలామంది పోటీ పడడంతో పాటు కొంతస్థలాన్ని ఆక్రమించారు.
 
 ఈ విషయం తెలుసుకున్న స్వర్ణకారుల సంఘ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు 2005 సంవత్సరంలో స్థలాన్ని సర్వే చేయించారు. 520/1లో సుమారు 10 సెంట్లు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని అప్పటి కలెక్టర్ కోటేశ్వరరావుకు సర్వే సిబ్బంది నివేదించారు. దీంతో స్వర్ణకారుల సంఘ సభ్యులతో కలెక్టర్ మాట్లాడి సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అయితే సంఘ కార్యకలాపాలు ఇటీవల నిలిచిపోయాయి. దీన్ని అనుకూలంగా మలుచుకున్న కబ్జాదారులు ఈ స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కొంత స్థలంలో ఓ వ్యక్తి దర్జాగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టి అద్దెలకు ఇచ్చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో మిగి లిన స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు ముమ్మ రం చేసినట్టు తెలిసింది. రాజకీయ అండతో పాగా వేసేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం టెక్కలిలో సెంటు స్థలం లక్షల రూపాయలు పలుకుతుం డడంతో కబ్జాదారుల మధ్య కూడా పోటీ పెరిగింది.   ఇప్పటికైనా ఇండస్ట్రిరియల్, రెవెన్యూ అధికారులు స్పందించకపోతే కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలం ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్లడం ఖాయమని స్థానికు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు