'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'

19 Jan, 2016 15:41 IST|Sakshi

పాతపట్నం (శ్రీకాకుళం) : మీ ఇంటికే మీ భూమి కార్యక్రమం, జిల్లా కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారో తెలియజేస్తూ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. వీటి ద్వారా మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూరిందన్నారు.

మరిన్ని వార్తలు