‘నీరు-చెట్టు’ను ఉద్యమంలా చేపట్టండి

3 May, 2015 03:43 IST|Sakshi

చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఎస్.గీర్వాణి కోరారు. ఆమె శనివారం తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులను అభివృద్ధి చేసుకోవాలని రైతులను కోరారు. ఆదిశగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు క్షేత్రస్థాయిలో శ్రద్ధ వహించి ప్రజలను చైతన్యపరచాలని కోరారు.

ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకుని పొ  లాలకు లింక్‌రోడ్లు నిర్మించుకోవాలని ఆమె తెలిపారు. ప్రతి జాబ్‌కార్డుదారుని కి కచ్చితంగా 100 రోజులు పని కల్పిం చేలా డ్వామా అధికారులు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మామిడి పంట ఎగుమతులకు అనుకూలంగా ఉందని, తద్వారా రైతు లు ఆర్థికంగా పరిపుష్టిని పొందాలని కోరారు. సాగునీటి వనరులు పుష్కలం గా లేని మెట్టభూముల్లో ఉపాధి పథకం ద్వారా మామిడి మొక్కలు నాటుకుంటే ప్రభుత్వం ఎకరాకు రూ. 1.35లక్షలు చొప్పున మూడెకరాలకు గరిష్టంగా రూ.4.05లక్షలు చెల్లిస్తుందన్నారు.

దేశీ య మార్కెట్‌లో గిరాకీ ఉన్న జామ మొక్కల పెంపకంపై సన్నకారు రైతులు మక్కువ చూపాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు సత్వరమే చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరుగుదొడ్ల నిర్మాణాలు ముందుకు సాగవని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు అవరమైన ప్రతిచోట నిధులు విరివిగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా జీపీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. 

మరిన్ని వార్తలు