ఆక్వాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

8 Jun, 2020 15:34 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన అనుకూల మీడియాతో చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను విమర్శించే స్థాయికి చంద్రబాబు దిగజారారని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశారని, మిగిలిన 10 శాతాన్ని కూడా ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా వెల్లడించామన్నారు. (సమగ్ర భూ సర్వేలో ఆలస్యం వద్దు: సీఎం జగన్)‌

సంక్షేమ పాలన అందించి, సీఎం జగన్‌ ప్రజల మన్ననలు పొందడంతో టీడీపీ నేడు దిక్కుతోచని పరిస్థితిలో పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని టీడీపీకి అర్థమైందన్నారు. ఆక్వా రంగంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తుని నియోజకవర్గం ఆక్వాజోన్‌లో చంద్రబాబు తన బినామీ కంపెనీ అయిన దివిస్‌ పరిశ్రమను తీసుకొచ్చే యత్నం చేశారని ఆయన ఆరోపించారు. కరోనా సమయంలో కూడా ఆక్వారంగాన్ని మద్దతు ధరతో సీఎం జగన్ ఆదుకున్నారని దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!)


 

మరిన్ని వార్తలు