అవినీతి సర్కారుకు బుద్ధి చెప్పాలి

3 Oct, 2013 23:43 IST|Sakshi
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అవినీతిమయమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వాలు మనుగడ కోల్పోవడం ఖాయమని అన్నారు. సీపీఐ రాష్ట్ర శాఖ   పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీపీఐ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, నాయకులు రామకృష్ణ, బాలమల్లేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, కానీ పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు.
 
మరిన్ని వార్తలు