సుమతి ఏజెన్సీ సర్వీసెస్‌పై గవర్నర్‌ ఆగ్రహం

6 Nov, 2019 22:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాజ్‌భవన్‌ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకతవకలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ సుమతి ఏజెన్సీ సర్వీసెస్ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. 20 మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన సుమతి ఏజెన్సీ సంస్థ మేనేజర్ మునిశంకర్‌పై బాధితులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ ఈ ఉద్యోగాల అవకతవకలపై కార్యదర్శితో కమిటీ వేశారు. ఉద్యోగాల పేరిట వసూళ్లు నిజమేనని కమిటి నివేదిక ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను గవర్నర్ ఆదేశించారు. అక్రమదందాకు తెరలేపిన సుమతి సంస్థ మేనేజర్ మునిశంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు