అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ దంపతులు

1 Oct, 2019 13:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.  గాయత్రి దేవి అలంకారంలోఉన్న అమ్మవారిని గవర్నర్‌ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ ఈవో సురేష్‌బాబు గవర్నర్‌ దంపతులను శేష వస్త్రాలతో సత్కరించారు. అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని వారికి అందజేశారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో దుర్గమ్మ గుడి ఒకటిగా నిలుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. గనులశాఖ మంత్రి బాలినేన్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు గాయత్రీ దేవీ అలంకారంలో ఉన్న దుర్గమ్మకు బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు