ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్‌ ఏరియల్‌ సర్వే

17 Aug, 2019 13:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం గవర్నర్‌ బిస్వభూషన్‌ హరిచందన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్‌ ప్రకటించారు. వరద నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తూ అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 12 మంది గ్రామాలు నీట మునగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాల్లోనూ ఫైర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బృందాలుగా ఏర్పడి​ బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు మెడికల్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు