‘ఈ కళాశాలకు రావడం చాలా గర్వంగా ఉంది’

6 Nov, 2019 14:56 IST|Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడలోని  కేబీఎన్‌ (కాకరపర్తి భావనారాయణ) కళాశాల 50వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలకు రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్‌ కళాశాల ఎంతో మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. ‘ఉన్నతమైన మౌలిక సదుపాయాల ద్వారా మంచి విద్యను అందిస్తోంది. రానున్న రోజుల్లో మన దేశం విద్యకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇండియా ఇతర దేశాలకు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను అందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధంచేయడం అవసరం’ అని అన్నారు. 

ఇంకా వారు మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య విజయవాడ వాస్తవ్యులు కావడం గర్వకారణమన్నారు.  జాతిపిత గాంధీజీ ఐదుసార్లు విజయవాడను సందర్శించారని తెలిపారు. అదేవిధంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాలుష్యం కారణంగా.. ఎంతో మంది దేశ రాజధాని ఢిల్లీని వదిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు