తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మండిపడ్డారు. ఆ చానల్ నిర్వహణ తీరుపై టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సర వేడుకలు, పండగ, పర్వదినాలు, సెలవు దినాలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉండటం సహజమేనని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ వివరణ ఇచ్చారు.
నిన్న ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలిపై ఓ పోలీసు వాకిటాకీతో దాడి చేసింది. దాంతో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వివరణ ఇచ్చారు. అయితే నూతన సంవత్సరం సందర్బంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీ పాస్‌ల మంజూరులో పూర్తి పారదర్శకత పాటించామని గోపాల్ వెల్లడించారు.