బోటు ప్రమాదంపై గవర్నర్‌ దిగ్భాంత్రి..

16 May, 2018 07:55 IST|Sakshi
గవర్నర్‌ నరసింహాన్‌

సాక్షి, హైదరాబాద్‌ : దేవీపట్నం బోటు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈసీఎల్‌ నరసింహాన్‌ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని గవర్నర్‌ కోరారు. ఎప్పటికప్పుడు అధికారులను అడిగి గవర్నర్‌ సమాచారం తెలుసుకుంటున్నారు. బోటులో ఆహ్లాదకరంగా సాగాల్సిన ప్రయాణం విషాదాంతమైంది. గోదావరి నదిలో లాంచీ మునిగి దాదాపు 36 మంది గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరులో చోటుచేసుకుంది. 

లాంచీ ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోటు బయలుదేరే సమయంలో 36మంది ఉన్నారు. 36మందిలో 16 మందికి ఒడ్డుకు చేరుకున్నారని ఆయన తెలిపారు.  మార్గమధ్యలో ఎంతమంది దిగారన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. బోటు ప్రమాదానికి గురైన చోట.. లోతు గుర్తించి వెలికి తీసే ఆలోచనలో ఉన్నామని కలెక్టర్‌ కార్తికేయ చెప్పారు. 
 

మరిన్ని వార్తలు