గాలికి రూ.లక్ష!

24 May, 2016 01:11 IST|Sakshi
గాలికి రూ.లక్ష!

శ్రీకాకుళం టౌన్: జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఖరీదైన గాలిని అనుభవిస్తున్నా రు. నెలకు లక్ష రూపాయలు అద్దె చెల్లించి పెడస్టల్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకున్నారు. జెడ్పీ కార్యాలయాన్ని ఆధునికీకరించడానికి అధికారులు నిర్ణయించారు. అన్ని గదుల్లో నూ సీలింగ్ పనులు చేయడానికి పూనుకున్నారు. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులకు పనులు కూడా పురమాయించారు. దీంతో వారు కూడా అంచనాలు సిద్ధం చేశా రు. మొత్తం పనులన్నీ చేయడానికి రూ.40 లక్షలు కావాలని నివేదించారు. ఈ మేరకు టెండర్లు పిలవడంతో విశాఖకు చెందిన కాం ట్రాక్టరు ఈ పనులు దక్కించుకున్నారు. పనులు ఆరంభమైన తర్వాత గదుల్లోని ఫ్యాన్లను తొలగించారు.

ఉద్యోగులు పనిచేసేం దుకు వీలుగా తాత్కాలికంగా పెడస్టల్ ఫ్యాన్లు అమర్చారు. విద్యుత్ సరఫరా కోసం తాత్కాలిక బోర్డులను అమర్చి వాటికి వి ద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. కార్యాలయం మొత్తమ్మీద తాత్కాలిక పద్ధతిలో 50 పెడస్టల్ ఫ్యాన్లను అమర్చి నెలకు రూ. లక్ష అద్దె సమర్పిస్తున్నారు. ఇప్పటికే పనులు ఆరంభమై మూడు నెలలు గడిచింది. ఇవి పూర్తి కావడానికి మరో నాలుగు నెలలైనా పడుతుంది. అంతవరకు నెలకు రూ.లక్ష చొ ప్పున చెల్లించాలి. పనుల్లో జాప్యం జరిగితే మరో లక్ష కూడా పెరగవచ్చు. ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
 
మెరుగైన సౌకర్యాల కోసం...
కార్యాలయ నిర్వహణలో భాగంగా ఉద్యోగులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ఆధునికీకరణ పనులు చేపట్టాం. అందులో భాగంగానే తాత్కాలి కంగా సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. వేసవి తీవ్రత వల్ల కార్యాలయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. అందుకే తాత్కాలికంగా ఫ్యాన్లను ఏర్పాటు చేశాం. పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నాం. పనులు వేగంగా పూర్తి చేస్తే ఫ్యాన్లకు అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- బి.నగేష్, సీఈఓ, జిల్లాపరిషత్

మరిన్ని వార్తలు