త్వరలో జీపీ కార్యదర్శుల నియామకం

31 Dec, 2013 03:58 IST|Sakshi

  జిల్లాకు 350 పోస్టులు
   విడుదలైన నోటిఫికేషన్
 
 పాలమూరు, న్యూస్‌లైన్ :
 నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రా ష్ట్ర వ్యాప్తంగా 2,677 పోస్టులను నిర్ణయించగా అందులో మహబూబ్‌నగర్ జి ల్లాకు 350 జీపీ కార్యదర్శుల పోస్టులను కేటాయించింది. డిగ్రీ విద్యార్హతతో చేపట్టనున్న ఈ నియామకాలకోసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సోమవారం ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల నియామకాని కి నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగాలకోసం అభ్యర్థుల ఎదురు చూ పులకు తెరపడింది. వచ్చేనెల  4వ తేది నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. దరఖాస్తుదారులు జనవరి 20వ తేది లోపు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
 
  ఉద్యోగార్ధు ల వయసు 18 నుంచి 36 ఏళ్లుగా నిర్ధారించారు. వేత నం స్కేల్ రూ.7,520 నుంచి రూ.22,430 గా నిర్ణయిం చారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. పేపర్-1 పరీక్షలో జనరల్ స్టడీస్ అం శాలు, పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో నెల కొన్న సమస్యలు, మన రాష్ట్రంలోని అంశాలను ప్రత్యేక ఉదాహరణలతో వివరించే విధంగా ప్రశ్నాపత్రం ఉం టుంది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ప్రతీ పేపర్ గం టన్నర కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్న పత్రంలో 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు ఉంటాయి. పంచాయతీ కా ర్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
 
 కేటగిరీల వారిగా పోస్టుల వివరాలిలా...

మరిన్ని వార్తలు