ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది

6 Sep, 2014 03:11 IST|Sakshi

కడప  ఎడ్యుకేషన్: అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తే ఎంతో గౌరవప్రదమైందని అలాంటి వృత్తికి కళంకం తేవద్దని జిల్లా కలెక్టర్  కేవీ రమణ ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని కడప నగరం నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.
 
 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన  జిల్లా కలెక్టర్ కేవీ రమణతోపాటు అదనపు  జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఆర్‌జేడీ రమణకుమార్, మేయర్ సురేష్‌బాబు, శాంతి సంఘం ప్రధాన కార్యదర్శి రాజారత్నం ఐజాక్, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, డీఈఓ కుంభ అంజయ్య, డీఎస్‌ఓ రెహమాన్ , డిప్యూటి డీఈఓలు రంగారెడ్డి, ప్రసన్న అంజనేయులు, విజయలక్ష్మీ, ఎంఈఓ నాగమునిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  ఉపాధ్యాయులంటే  అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు.   రాజకీయాలకు దూరంగా ఉంటూ ఒత్తిడికి లోనుకాకుండా  విద్యార్థులకు విద్యా బోధన చేయాలన్నారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యాన్ని పెంచాలన్నారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులే పిల్లలకు మార్గదర్శకులని, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు.  
 
 ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కానివారు నిరుత్సాహం చెందవద్దని సూచించారు. ఎంపికైన వారు మరింత భాద్యతగా పనిచేయాలన్నారు. మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ దేశంలోనే అధికంగా గౌరవించే  వ్యక్తి ఉపాధ్యాయుడేనన్నారు. మిగతా ఏవృత్తిలోనైనా మచ్చలుండవచ్చని  ఈ వృత్తిలో మాత్రం అలాంటివి ఉండవన్నారు.  ఆర్‌జేడీ రమణకుమార్ మాట్లాడుతూ ఈ దినం  ఉపాధ్యాయ లోకం గర్వించదగ్గ రోజన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహోన్నతుడు సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న కళలను వెలికి తీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువుతోపాటు సమాజ సేవ, నైతిక విలువలను కూడా నేర్పించాలన్నారు.
 

మరిన్ని వార్తలు