ప్రజాభిమానం వల్లే..

13 Jun, 2014 02:15 IST|Sakshi
ప్రజాభిమానం వల్లే..

విజయనగరం ఫూల్‌బాగ్: ప్రజాభిమానం వల్లే తాను కేంద్రమంత్రి స్థాయికి ఎదిగానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశో క్‌గజపతిరాజు అన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గురువారం ఆయన తొలిసారిగా జిల్లాకు వచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ తాను చాలా అదృష్టవంతుడ్ని అని, ఎనిమిది సార్లు విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ప్రజ లు తనను ఏడుసార్లు గెలిపించారన్నారు. వారి రుణా న్ని తప్పకుండా తీర్చుకుంటానని చెప్పారు.
 
 టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనను చాలాసార్లు ఎంపీగా పోటీ చేయాలని అడిగారని,నాడు తనకు అనుభవం లేదని చెప్పానని గుర్తు చేశారు. తనతాత, తండ్రి, అన్న య్య ఎంపీలుగా ఉన్నా.. వారెవరికీ దక్కని కేంద్రమంత్రి పదవి తనకు దక్కిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ర్టం, జిల్లాలో తాగునీటికి ఇబ్బందులున్నా.. మద్యానికి మాత్రం కొరత లేదన్నారు. నాటి కాంగ్రెస్ పాలనే ఇందుకు కారణమని విమర్శించారు. విద్యార్థులు చదువుకునేందుకు ప్రోత్సహించాలని, మద్యాన్ని కాదని పరోక్షంగా మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే... తమ ప్రభుత్వంలో ప్రజలకు స్వతంత్రాన్ని అందించామని చెబుతున్నారని, స్వతంత్రం అంటే ప్రజలపై కర్ఫూలు విధించడం, 144 సెక్షన్లు పెట్టడం కాదని వి మర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
 
 పట్టణంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను క్రమ శిక్షణతో నిర్వర్తిస్తానన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అధ్యక్షతన జరి గిన ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ర్ట అధ్యక్షురాలు శోభా హైమావతి, ఎమ్మెల్యేలు మీసాల గీత, కె. ఎ.నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, అశోక్ సతీ మణి సునీలా గజపతి, కుమార్తె అతిథి గజపతి, అరకు పార్లమెంట్ టీడీపీ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి, మాజీ మంత్రి గద్దె బాబూరావు, సాలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి భంజ్‌దేవ్, టీడీపీ పట్టణ అధ్యక్షు డు ప్రసాదుల రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు సైలాడ త్రినాథరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కర్రోతు నర్సింగరావు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి ఈగల సత్యారావు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
 
 అశోక్‌కి ఘన స్వాగతం
 కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు వచ్చిన అశోక్‌గజపతిరాజుకి జిల్లా టీడీపీ నా యకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరు కున్నారు. అక్కడ తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో సుమారు గంట పాటు మాట్లాడారు. అనంతరం సాయంత్రం 5 గంట లకు ఐనాడ జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ విజయనగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికారు. ఓపె న్ టాప్ జీపులో అశోక్ ఐనాడ జంక్షన్ నుంచి విజయనగరం ఎత్తుబ్రిడ్జి మీదుగా రైల్వేస్టేషన్ రోడ్డు, వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్, ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి, కన్యకాపరమేశ్వరి కోవెల, గంట స్తంభం మీదుగా మూడు లాంతర్ల జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం కోట జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సన్మాన సభలో మాట్లాడారు.

మరిన్ని వార్తలు