కనుల పండువగా చందనోత్సవం

22 Apr, 2015 05:57 IST|Sakshi
అప్పన్న దర్శనం కోసం ఎండలో బారులు తీరిన జనం

సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(నిజరూపదర్శనం) మంగళవారం కనుల పండువగా జరిగింది.  సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. సుప్రభాతసేవ, విష్వక్సేన పూ జ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, కలశారాధన నిర్వహించారు. తదుపరి స్వామిపై ఉన్న 12 మణుగుల చందనాన్ని వెండి బొరుగులతో తొలగించి నిజరూపభరితుణ్ని చేశారు.

తెల్లవారుజామున 2 గంటలకు  దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ఆనందగజపతిరాజు తొలిదర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం 2.30 గంటల నుంచి ఉచిత క్యూల్లో వేచివున్న సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, దేవస్థానం క్యూలు, టెంట్లు ఏర్పాటు చేసినా సరిపోక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఎండలో విలవిల్లాడారు. పలు చోట్ల భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి.

 

>
మరిన్ని వార్తలు