డి - పట్టా భూములపై దృష్టి

26 Sep, 2015 23:42 IST|Sakshi

భూ సేకరణ కార్యాలయంలో ఎసైన్డ్ ల్యాండ్ నిర్వాసితులతో చర్చలు
 భూ సేకరణ కార్యాలయంలో కంచేరు
 గ్రామస్తులతో   కలెక్టర్  సమావేశం
 త భూములివ్వాలని ఒత్తిడి

 
 విజయనగరం కంటోన్మెంట్: ప్రాణాలు పోతున్నా....ఆందోళనలు తీవ్రతరమవుతున్నా వాటిని లెక్కచేయకుండా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు భూ సేకరణ కోసం జిల్లా అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. భోగాపురంలో అయితే గొడవలు వస్తున్నాయని జిల్లా కేంద్రంలోని విమానాశ్రయ భూ సేకరణ కార్యాలయంలో డిపట్టా భూములున్న రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసి వారిని నయానోభయానో ఒప్పించి అంగీకార పత్రాలు రాయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా కణపాకలో గల యూత్‌హాస్టల్‌లో ఉన్నభోగాపురం  విమానాశ్రయ భూ సేకరణ కార్యాలయంలో కంచేరు గ్రామానికి చెందిన   అసైన్డు ల్యాండు భూముల యజమానులతో శనివారం  కలెక్టర్  సమావేశం నిర్వహించారు.
 
 కంచేరు గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన, వారు సాగుచేసుకుంటున్న భూములను తిరిగి వెనక్కు తీసుకుని  పరిహారం చెల్లించేందుకు వారితో చర్చించారు.   ప్రభుత్వం ఇచ్చిన భూమే కనుక ఎట్టి పరిస్థితులలోనూ భూములు తీసుకోవడం ఖాయమనీ, ముందుగా అంగీకరిస్తే మీకు పరిహారమిస్తామని  వారిపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆర్డీఓ ఎస్ శ్రీనివాసమూర్తి, భోగాపురం తహశీల్దార్ లకా్ష్మరెడ్డి,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, ఇతర డిప్యూటీ తహశీల్దార్లు ముందుగా వారితో సమావేశమయ్యారు.  తరువాత కలెక్టర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. జిరాయితీ భూముల కన్నా తక్కువ పరిహారం వస్తుందని, పరి హారంపై  చర్చించే అవకాశం ఉండదనివారికి చెప్పారు. దీంతో కొంతమంది భూములు ఇచ్చేందుకు అంగీకరించారు.
 
 రోజుకో గ్రామం చొప్పున విమానాశ్రయానికి అవసరమైన
 భూ సేకరణకు గుర్తించిన తొమ్మిది గ్రామాల్లో  రోజుకో గ్రామానికి చెందిన  డీ పట్టా భూముల యజమానాలతో సమావేశాలు జరిపేందుకు నిర్ణయించారని సమాచారం.  వారిని నయానో భయానో  ఒప్పించి, వారితో అంగీకార పత్రాలు రాయించుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు.   
 

మరిన్ని వార్తలు