‘నెలలోపు గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాలు’

16 Jul, 2017 18:33 IST|Sakshi
‘నెలలోపు గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాలు’

విశాఖపట్నం: నెలలోపు గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాల విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. ఈ రోజు రాత్రి మూడు పేపర్లకు సంబంధించిన కీ విడుదల చేస్తామన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీకి పంపిస్తామని చెప్పారు. అనంతరం రివైజ్డ్‌ కీ విడుదల చేస్తామన్నారు. రివైజ్డ్‌ కీ విడుదల చేసిన మూడు రోజుల తర్వాత తుది కీ వెల్లడిస్తామని అన్నారు.

గీతం యూనివర్సిటీ ఘటనలో సీసీ టీవీ ఫుటేజీ ద్వారా 41 మంది అభ్యర్థులను గుర్తించామని, వారిపై నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 సెంటర్లలో 45,287 మంది గ్రూప్‌-2 మెయిన్స్‌కు హాజరయ్యారని వెల్లడించారు.