కరోనా మందుల వాడకానికి మార్గదర్శకాలు

21 Jul, 2020 05:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 సోకిన వారికి అవసరమైన మందుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. బాధితులకు ఇష్టారాజ్యంగా కాకుండా ఐసీఎంఆర్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన మేరకే ఏ స్థాయిలో మందులు వాడాలో ఈ మార్గదర్శకాల్లో వివరించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రులు, కోవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు వైద్యమందించే ప్రైవేటు ఆస్పత్రులు ఈ మార్గదర్శకాలను అనుసరించి మందులు వాడాలని సూచించారు. వీటికి నిర్ణయించిన ధరను మాత్రమే వసూలుచేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మందుల వివరాలివీ..
► సైటోకైన్‌ స్టార్మ్‌ సిండ్రోం ఉన్న దశలో తోసిలిజుమాంబ్‌ ఇంజక్షన్‌ వాడాలి.
► తీవ్రత తక్కువగా ఉన్న కోవిడ్‌ కేసులకు ఫావిపిరావిర్‌ మాత్రలు ఇవ్వాలి.
► తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న రోగులకు రెమిడెసివిర్‌ ఇవ్వాలి.
► సెప్సిస్‌ లేదా సెప్టిక్‌ షాక్‌ వంటి పరిస్థితుల్లో మెరొపెనం ఇంజక్షన్‌ను ఇవ్వాలి.

ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ మేరకే డోసులు
కాగా, ఈ మందులకు ఐసీఎంఆర్‌ లేదా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు విధిగా ఉండాలి. ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ మేరకు ఎన్ని డోసులు ఇవ్వాలో అంతకే ఆరోగ్యశ్రీ చెల్లిస్తుంది. అంతకంటే ఎక్కువ డోసులు వేస్తే చర్యలు ఉంటాయి. 

మరిన్ని వార్తలు