ఏజెంట్ల మాయమాటలు నమ్మొద్దు

7 Feb, 2019 07:46 IST|Sakshi
బాధిత కుటుంబాల వద్ద నుంచి వినతిపత్రం తీసుకుంటున్న మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): ఏజెంట్ల మాయమాటల్లో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రవాసాంద్రుల సేవా కేంద్రం అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు సూచించారు. బుధవారం గల్ఫ్‌హెల్ఫ్‌ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణంలో కైండ్‌నెస్‌ సొసైటీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవనోపాధి నిమిత్త గల్ఫ్‌దేశాలకెళ్లి అక్కడ బాధపడుతోన్న వారి కుటుంబీకులు పలువురు మాణిక్యాలరావు వినతిపత్రాలను అందించారు.

మస్కట్‌లో అనారోగ్యంతో బాధపడుతోన్న నిడదవోలు మండలం గోపవరానికి చెందిన ముప్పిడి పోసమ్మను స్వదేశానికి రప్పించాలని ఆమె కుమారుడు నరేష్‌ కుమార్‌ వినతిపత్రం అందించారు. 9 నెలల క్రితం మస్కట్‌ వెళ్లి అక్కడ యజమానితో ఇబ్బందులు పడుతోన్న విశాఖ జిల్లా ప్రాయకరావుపేటకు చెందిన ఎం.సూర్యవతిను స్వదేశానికి రప్పించాలని ఆమె భర్త శ్రీనివాసరావు, రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన పాలకోడేరు మండలం గరగపర్రుకు చెందిన మేడిశెట్టి సాయిబాబును స్వదేశం రప్పించాలని ఆయన భార్య రాధ కోరారు. ఖత్తర్‌ వెళ్లి అనారోగ్యంతో పనిచేయలేకపోతోన్న పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఇ.మంగను స్వదేశానికి రప్పించాలని ఆమె భర్త సురేష్‌ వినతిపత్రం అందించారు.

మరిన్ని వార్తలు