గన్ మిస్‌ఫైర్.. తప్పిన ముప్పు

22 Jul, 2015 13:39 IST|Sakshi

కర్నూలు: వెపన్ క్లీనింగ్‌లో భాగంగా.. తుపాకీని శుభ్రం చేసి లోడ్ చేస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ అది మిస్‌ఫైర్ అయింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పోలీస్‌ హెడ్క్వార్టర్స్లో బుధవారం జరిగింది. డీపీఓలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోహన్ తన ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ మిస్‌ఫైర్ అయింది. ఆ సమయంలో గన్ బ్యారల్ పైవైపుకు తిప్పి ఉండటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

మరిన్ని వార్తలు