గుంటూరు పోలీసుల ఓవరాక్షన్‌

29 Aug, 2018 16:19 IST|Sakshi
పోలీసుల అదుపులో ముస్లిం యువత

సాక్షి, గుంటూరు : అధికార పార్టీ అండదండలతో గుంటూరు పోలీసులు పెచ్చుమీరుతున్నారు. నాయకుల మెప్పుపొందటానికి అమాయకులను అక్రమంగా నిర్భందిస్తున్నారు. మంగళవారం చంద్రబాబు నాయుడు ‘‘నారా హమారా... టీడీపీ హమారా’సభలో ప్రసంగిస్తున్న సమయంలో బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఎనిమిది మంది ముస్లిం యువకులను గుంటూరు పోలీసులు అక్రమంగా నిర్భందించారు. నిన్నటి నుంచి పలు స్టేషన్లు తిప్పి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు వారిని తరలించారు. పోలీసులు మీడియాను సైతం స్టేషన్‌లో అడుగుపెట్టనివ్వటం లేదు. ఇది పెద్దొళ్ల వ్యవహారం అంటూ వివరాలను వెల్లడించటం లేదు.

అసలేం జరిగింది..
మంగళవారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ‘నారా హమారా... టీడీపీ హమారా’ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఆ సభలో  చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కర్నూలు జిల్లా నంద్యాలకు  చెందిన కొందరు విద్యార్థులు నిలుచుని ‘నారా హమారా నహీ... నారా ముస్లిం ద్రోహి .. ముస్లింలకు టీడీపీలో న్యాయం జరగడం లేదు’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.  అసహనానికి గురైన సీఎం.. ఒకరిద్దరు వచ్చి గొడవ చేస్తే భయపడతామని అనుకోవద్దని, వారి అంతు తేలుస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. అనంతరం వారిని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌కు అక్కడి నుంచి క్యూ ఆర్టీ స్టేషన్‌కు  తరలించారు.

మరిన్ని వార్తలు