సీఎం జ‌గ‌న్ స్ఫూర్తితో వెల్లివిరిసిన సేవాభావం

1 Apr, 2020 19:32 IST|Sakshi

సాక్షి,గుంటూరు: లాక్‌డౌన్ నేప‌థ్యంలో రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కూలీల‌కు గుంటూరు జిల్లా యువ‌కులు కూర‌గాయలు పంపిణీ చేసి త‌మ సేవాభావాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ల స్ఫూర్తితోనే ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. రేపల్లె మండలం, అరవపల్లె పంచాయతీ పరిధిలోని కొత్తపేట, గుంటూరు వారి పాలెంతో పాటు.. రెండు హరిజనవాడల్లోని  250 పేద కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రెండు కేజీల కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. 

దేశానికి సేవ చేయటానికి ఇదే సరైన సమయమని ఆ ప్రాంత యువ‌కులు అభిప్రాయప‌డ్డారు. దేశం విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో సాటి మనిషికి సాయం చేసినా దేశానికి సేవ చేసినట్లేనని  రేపల్లె మండలం, ఉప్పూడి ఎంపిటీసీ వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి అల్లంశెట్టి సతీష్ బాబు అన్నాడు. 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు