టార్గెట్‌ సూర్యుడు..

11 Aug, 2018 13:03 IST|Sakshi
నాసాకు ఎంపికైన విద్యార్థితో ప్రిన్సిపల్‌ చలపతి. ఉపాధ్యాయులు

నేడు నాసా ప్రయోగం

నాసాకు గిరిజన గురుకుల విద్యార్థి ఎంపిక

వైస్సార్ కడప ,సుండుపల్లె: మన సౌరవ్యవస్థ రారాజు సూర్యుడికి మీ పేరు చెప్పాలనుకుంటున్నారా..అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా..అందుకే మీ పేరు సూర్యుడికి అందజేస్తాం..వివరాలు పంపించండని నాసా సువర్ణావకాశం కల్పించింది. పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ పేరుతో భానుడి వాతావరణం తెలుసుకునేందుకు శనివారం నాసా ప్రయోగం చేయనుంది. అంతరిక్షనౌక దాదాపు 63కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యుడి కాంతివలయం వద్దకు చేరుకుం టుంది. అక్కడి నుంచి సౌరమంట నక్షత్రానికి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేస్తోంది.అందువల్ల పనిలో పనిగా ఓమైక్రోచిప్‌లో భూవాసుల పేర్లు పంపాలని నిర్ణయించింది. ఈ పేర్లలో సుండుపల్లె మండలానికి చెందిన గిరిజన గురుకుల విద్యార్థి భరత్‌కుమార్, సైన్స్‌ ఉపాధ్యాయుడు బాషా పేర్లు వచ్చాయి. వీరికి ప్రిన్సిపల్‌ చలపతి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

సంతోషంగా ఉంది: నా పేరు భరత్‌కుమార్‌ నాయక్‌.అమ్మ అమ్మణ్ణి, తండ్రి రాజానాయక్‌. సుండుపల్లె మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామపంచాయతీ మిట్టబిడికి కాలనీ, సామాన్యరైతు కుటుంబం. నాసాకు ఎంపికకావడం సంతోషంగా ఉంది. సూర్యుని ఎవరు తాగగలరనే బృహత్తర కార్యక్రమంలో భాగంగా నాపేరు మైక్రోచిప్‌లో ఉంచడం, వారి నుంచి సర్టిఫికెట్‌ పొందడం ఆనందంగా ఉంది. బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తా.      – భరత్‌కుమార్‌ నాయక్,    5వ తరగతి, గిరిజన గురుకుల విద్యార్థి

మరిన్ని వార్తలు