హంద్రీ - నీవా సర్వే పనులకు రైతుల బ్రేక్

18 Jul, 2015 02:13 IST|Sakshi

అలైన్‌మెంట్ వూర్చారంటూ నిరసన
అధికారులను తిప్పిపంపేశారు

 
గుర్రంకొండ : హంద్రీ-నీవా సర్వే పనులను రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. అలైన్‌మెంట్ వూర్చారంటూ నిరసన తెలియుజేశారు. పనులు చేయనీయకుం డా అధికారులను వెనక్కు పంపేశారు. ఈ సంఘటన గుర్రంకొండ వుండలంలోని రావూపురం గ్రావుంలో జరిగింది. శుక్రవారం ఆ గ్రావూనికి సమీపంలో గతంలో నిలిచిపోరుున కాలువ పనుల వద్దకు హంద్రీ-నీవా అధికారులు, సర్వేయుర్లు చేరుకున్నారు. సమీప పొలాల్లో సర్వే చేస్తుండగా విషయుం తెలుసుకున్న రైతులు అక్కడికి వచ్చారు. గతంలో ఇచ్చిన అలైన్‌మెంట్ (రూట్ వ్యూప్) ప్రకారమే సర్వే చేయూలని పట్టుబట్టారు.

ఇద్దరు భూస్వావుుల పొలాలు కాపాడేందుకే సర్వే వూర్చుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తవు పొలాల్లో సర్వే చేయువద్దంటూ అడ్డుకున్నారు.  ప్రస్తుతం వూర్చి చేస్తున్న సర్వేతో తవుకున్న కొద్దిపాటి పొలాలు పోగొట్టుకుంటావుని ఆవేదన చెందారు. గతంలో ఇచ్చిన వూర్కింగ్ ప్రకారమే సర్వేచేసి  పనులు చేపట్టాలని, లేని పక్షంలో పనులు జరగనివ్వబోవుని హెచ్చరించారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయుత్నం చేశారు. అరుునా రైతులు వెనక్కి తగ్గకుండా సర్వే పనులు అడ్డుకుని నిరసన తెలియుజేశారు. అధికారులు సర్వేపనులు నిలిపివేసి వెళ్లిపోయూరు.
 

మరిన్ని వార్తలు