బేటీ బచావో .. మోడీ హటావో

18 Apr, 2018 09:30 IST|Sakshi
ఆసీఫా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వై.వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకులు

∙చిన్నారిని చిదిమేసిన మానవ మృగాలను ఉరితీయాలి

∙వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోకాగడాల ప్రదర్శన

గుంతకల్లు టౌన్‌ : కథువాలో చిన్నారి ఆసీఫాను అత్యాచారం చేసి హత్యచేసిన మానవ మృగాలను ఉరితీయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు.  చిన్నారి ఆసీఫాను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వైఎస్సార్‌ విగ్రహం వద్ద నుంచి గాంధీచౌక్‌ తిరిగి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా వై.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పసిప్రాణాన్ని  చిత్రవధలకు గురిచేసి నిర్ధాక్షిణ్యంగా చంపేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మానవ మృగాలను క్షమించరాదన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, పట్టణ, మండల అధ్యక్షులు సుంకప్ప, మోహన్‌రావు, కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఫ్లయింగ్‌మాబు, కౌన్సిలర్‌ టి.గోపి, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అహమ్మద్‌బాషా, ఎంబీ.మౌలా, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.  అలాగే   ఏపీ రాష్ట్ర సంచార జాతుల సం ఘం ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసులు, సీపీఎం పట్టణ కార్యదర్శి భజంత్రీశీనా   ఆధ్వర్యంలో ప్రజా, ముస్లీం, రాజకీయ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో నిందితుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. 

గుత్తి :  కతువాలో అభం, శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అతి పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ గుత్తిలో మంగళవారం రాత్రి  అన్ని మతాలు, కులాలు, పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఐద్వా మహిళలు,చిన్నారులు, మహిళలు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద నుంచి గాంధీ సర్కిల్‌ మీదగా ఆర్టీసీ బస్టాండ్, రాజీవ్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు.    అనంతరం గాంధీ సర్కిల్‌ వద్ద మానవ హారం చేపట్టారు.  నిరసనలో సుమారు 1500 మంది పాల్గొన్నారు.


గుత్తి ఆర్‌ఎస్‌లో : గుత్తి ఆర్‌ఎస్‌లో దక్షిణ మధ్య రైల్వే నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అసిఫా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు.  అలాగే  గుత్తి షటిల్‌ క్రీడాకారులు, యువకులు ట్రాన్స్‌కో కార్యాలయంలోని ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా నివాళులర్పించారు.

గుంతకల్లు : జమ్ము కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను ఆత్యాచారం చేసి, హత్య చేసిన మానవ మృగాలను నడిరోడ్డుపై ఉరితీయాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆసిఫా హత్యను నిరసిస్తూ మంగళవారం  మజ్దూ ర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.  కార్యక్రమంలో మజ్దూర్‌ యూనియన్‌ గుంతకల్లు డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రాజు, విజ య్‌కుమార్, సహయ కార్యదర్శులు కేఎం డీగౌస్, బాలాజీసింగ్, మస్తాన్‌వలి, కోశాధికారి శ్రీనివాసశర్మ, నాయకులు పీ.విజ య్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు