కాకికాడలో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం

26 Nov, 2017 18:00 IST|Sakshi

సాక్షి, కాకినాడ : మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఉదంతం సుఖాంతమైంది. అపహరణకు గురైన బుజ్జాయి ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు.

కాగా మూడు రోజుల క్రితం ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ మహిళ ... ప్రసూతి ఆస్పతి వార్డులో ఉన్న గంటా లక్ష్మి అనే మహిళ అనే బాలింత నుంచి ఒక్కరోజు వయస్సు ఉన్న ఆడశిశువును వ్యాక్సిన్‌ కోసమని నమ్మబలికి వెంట తీసుకు వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ వెళ్లినా.. ఆమె కళ్లుగప్పి..శిశువును ఆగంతకురాలు అపహరించింది. సీసీ కెమెరాల పుటేజ్‌ ఆధారంగా పోలీసులు  ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన పండు రమణ అనే అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి శిశివును తీసుకుని తల్లి లక్ష్మీకి అందజేశారు. నిందితురాలు గతంలో కాకినాడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసిందని...అయితే ఆరు నెలల క్రిందట ఆమెకు అబార్షన్ కావడంతో పిల్లలపై మమకారంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు