శ్రమించారు..సాధించారు

21 Dec, 2013 03:38 IST|Sakshi

ఆత్మకూర్, న్యూస్‌లైన్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం ట్రయల్ రన్ విజయవంతమైంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకు నిపుణులు, అధికారులు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తిచేశారు. దిగువ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రం మొదటి యూనిట్‌లో 300 క్యూసెక్కుల నీటిని వినియోగించి సన్నాహక పరీక్షలు నిర్వహించారు. మొదట టర్బయిన్లలో ఆయిల్ లీకేజీ, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్రయల్న్‌ల్రో కొన్ని ఆవాంతరాలు ఏర్పడ్డాయి. సాయంత్రం వరకు చిన్నచిన్న సమస్యలను అధిగమించి రాత్రి 7.30గంటల ప్రాంతంలో మొదటి టర్బయిన్‌లో 18 నిమిషాల పాటు ట్రయల్న్‌న్రు విజయవంతంగా చేపట్టారు. దీంతో జెన్‌కో అధికారులు, కార్మికులు ఆనందాల్లో మునిగితేలారు. ఈ ప్రక్రియను జెన్‌కో మాజీ డెరైక్టర్ ఆదిశేషుల బృందం పర్యవేక్షించింది. అనంతరం జెన్‌కో సీఈ(హెచ్‌పీసీ) రత్నాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంలో అనుకున్న సమయానికే పనులు పూర్తిచేశామని వివరించారు.
 
 గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సన్నాహక పరీక్షలు గురువారం రాత్రితో విజయవంతమయ్యాయని చెప్పారు. మరో రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో చిన్నపాటి సాంకేతిక సమస్యలను అధిగమించి మొదటి యూనిట్‌ను రన్ చేస్తామని, మరో పదిరోజుల్లోపు రెండవ యూనిట్‌ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. దిగువ జూరాలలో ఇదివరకే 294మీటర్ల మేర నీటిని నిల్వఉంచామన్నారు. మొదటిసారిగా నిర్వహించిన ఈ సన్నాహక పరీక్షల్లో 18నిమిషాల పాటు మొదటి యూనిట్‌ను రన్ చేసినట్లు వెల్లడించారు. అనుకున్న ప్రకారం త్వరలోనే దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేపడతామన్నారు. అంతకుముందు పవర్‌హౌజ్, వీయర్స్‌ను సందర్శించారు.
 
 జనవరి కల్లా 240మెగావాట్‌ల విద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీఈ సివిల్ సూర్యలక్షి్ష్మ, ఎలక్ట్రికల్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఎస్‌సీ సివిల్ శ్రీనివాస్, ఈఈలు రమణమూర్తి, రామభద్రరాజు, డీఈ వ్యాసరాజ్, ఏడీఈలు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, రామక్రిష్ణరెడ్డి, రూపేష్, పవన్‌కుమార్, ఆనంద్, శ్రీనివాస్, సునిల్, వీఆర్స్క్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌషిక్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు