మానవత్వాన్ని చాటుకుంటున్న సామాన్యులు

9 Apr, 2020 11:55 IST|Sakshi

సాక్షి, కృష్ణా: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో సామాన్యలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండటంతోఎన్నో నిరుపేద కుటుంబాలు నీళ్లు తాగి బతుకుతున్నాయి . అయితే వీరిని ఆదుకోవడానికి ఎందరో వారి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు. తమ దాతృత్వాన్ని చాలుకుంటున్నారు. పది మంది కలిస్తే చేతనైనంత సాయం చేయవచ్చనే ఆలోచనని ఆచరణలో పెడుతున్నారు. కొంత మంది వ్యక్తిగతంగా ఒక్కరై సాయం అందిస్తుంటే ఇంకొందరు బృందాలుగా సాయం అందిస్తున్నారు. (ఎందరో మహానుభావులు!)

ఇందులో భాగంగానే హాసిని కంప్యూటర్స్  మిత్ర బృందం కొండపల్లి గ్రామంలో 150 పేద  కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసి తమ మానత్వాన్ని చాటుకున్నారు. పారిశ్రామిక వాడలో పని చేస్తూ  లాక్‌డౌన్‌ కారణంగా  స్వస్థలాలకు వెళ్లలేని కుటుంబాల్ని గుర్తించి వాళ్ళకి  కూరగాయలు పంపిణీ చేశారు. వీరితో పాటు వృద్ధులు, ఎలాంటి ఆదరవూ లేని వికలాంగులని గుర్తించి వారికి కూడా కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో  చుట్టుకుదురు వాసు, భయ్య రాము,కొత్తపల్లి ప్రకాష్, గుంటుపల్లి గోపి,  ఎలక్ట్రికల్ శివ, కూచిపూడి రమేష్, అనిల్ డ్యాని, వంశీ, బండి వేణు, హాసిని కంప్యూటర్స్  భద్ర పాల్గొన్నారు. వీరి సాయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. మీరు కూడా మీరు చేస్తున్న సాయాన్ని తెలియజేయాలంటే వివరాలు పంపించాల్సిన మెయిల్‌ ఐడీ: webeditor@sakshi.com

  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు