నిధులున్నా వేతనాల్లేవ్..

2 Jan, 2014 04:22 IST|Sakshi

మోర్తాడ్, న్యూస్‌లైన్ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి. ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం ఆరంభం లో కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలకు సంబంధించిన గ్రాంటును మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే గ్రాంటు మంజూరు కావడంతో ప్రతి నెలా వేతనాలు పొందడానికి ఎలాంటి ఆటంకం ఉండదని కాంట్రాక్టు అధ్యాపకులు సం బర పడ్డారు. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి మునుపెన్నడూ లేని విధంగా వేతనాలు చెల్లించడంలో ఉన్న త విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది.

జిల్లాలో మోర్తాడ్, బిచ్కుంద, నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, ధర్పల్లిలో ప్రభు త్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో వివిధ సబ్జెక్ట్‌లను రెగ్యులర్ అధ్యాపకులతో పాటు, కాంట్రాక్టు అధ్యాపకులు, పార్ట్‌టైం అధ్యాపకులు బోధిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు దాదాపు 80 మంది వరకు జిల్లాలో పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం గతంలో వేతనాలను పెంచింది. ప్రతి కాంట్రాక్టు అధ్యాపకునికి రూ. 18 వేల నుంచి రూ. 24 వేల వరకు వేతనం లభిస్తుంది. 2012-13 విద్యా సంవత్సరానికి గాను ఫిబ్రవరి నెల వరకు వేతనాలు చెల్లించారు. అదే విద్యా సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. కళాశాలలు జూన్‌లో ప్రారంభం అయినా కాంట్రాక్టు అధ్యాపకులకు మాత్రం జూలైలోనే కాంట్రాక్టును పొడగించారు. వీరికి జూలై  నుంచి డిసెంబర్ నెల వర కు వేతనాలు మంజూరు కావాల్సి ఉం ది.

గడచిన విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు నెలల వేతనం, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల వేతనం కాంట్రాక్టు అధ్యాపకులకు రావాల్సి ఉంది. ప్రభుత్వం వేతనాల చెల్లింపుకోసం గ్రాంటును ముం దుగానే విడుదల చేసినా వేతనాల చెల్లింపునకు ఉన్నత విద్యా శాఖ ఎం దుకు తాత్సారం చేస్తుందో అర్థం కావ డం లేదని పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పని చేస్తున్న అనేక మంది మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెం దిన వారు ఉన్నారు.

 దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. తాము తమ కాళ్లపై నిలబడి పని చేస్తున్నా వేతనాలు లేక పోవడంతో ఇళ్ల నుంచి ప్రతి నెల డబ్బు తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని  కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు