జన తరంగం

3 Jan, 2014 01:21 IST|Sakshi
జన తరంగం

=అరకు సమైక్య శంఖారావం అపూర్వ రీతిలో విజయవంతం
 =వెల్లువలా తరలివచ్చిన గిరిజనం
 =మన్యంలో మార్మోగిన జగన్నినాదం

 
అరకు/ఆరకు రూరల్, న్యూస్‌లైన్: అరకులో జనసాగరం హోరెత్తింది. వెల్లువెత్తిన ప్రజానీకంతో జన జలపాతం పరవళ్లు తొక్కింది. సమైక్య శంఖారావం సభకు హాజరైన గిరిజనంతో అరకు నలుదిశలా జన సమూహమే కనిపించింది. మారుమూల ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనంతో అరకులో జాతర జరుగుతున్న భావం కదలాడింది. వైఎస్సార్‌సీపీ సారథి జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఉప్పొంగిన గిరిజనోత్సాహం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.  వైఎస్సార్ నామస్మరణతో అరకులోయ మార్మోగింది. వైఎస్సార్ సీపీ జెండాలతో కళకళలాడింది.

జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో ప్రతిద్వనించింది. మునుపెన్నడూ లేని విధంగా మారుమూల గూడేల నుంచి తరలివచ్చిన గిరిజన సంతతి అరకులో కదం తొక్కింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించింది. సమైక్యాంధ్రకు కట్టుబడ్డ పార్టీ వైఎస్సార్ సీపీయేనని, సమైక్యరాష్ట్రం కోసం తపన పడుతున్న వ్యక్తి  జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించింది.. వేల సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలను చూసి ఇతర పార్టీల నాయకులలో ఆశ్చర్యం వెల్లువెత్తింది.

కుంభా రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమైక్య శంఖారావం సభకు వచ్చిన ప్రజానీకంతో అరకు జనసంద్రమైంది. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద నుండి ఎంపీడీఓ కార్యలయం, టౌన్‌షిప్, వైఎస్సార్ జంక్షన్ మీదుగా సభా స్థలికి వైఎస్సార్‌సీపీ నేతలతో కలసి గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సభ జరిగినా జనం కదలకుండా ప్రసంగాలు విన్నారు. వందలాది మంది శ్లాబ్‌లు, ప్రహారీ గోడలు, దుకాణాలపై ఎక్కి నేతల ప్రసంగం ఆలకించారు.
 
సోనియా, చంద్రబాబు కుట్ర
 
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితే తమకు భవిష్యత్తు ఉండదన్న భయంతో సోనియా గాంధీ, చంద్రబాబు రాష్ట్ర విభజనకు తలపెట్టారని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకే సోనియా, బాబు విభజన కుయుక్తి పన్నారని విమర్శించారు. అరకులో నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కార్య నిర్వహక అరకులో శంఖారావం సభ జగన్ సభను తలపించిందని  పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు ప్రశంసించారు.

ఇటలీ బొమ్మ సోనియాకు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయం తెలియవని, అందుకే ఆమె విభజనకు సిద్ధపడ్డారని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనన్నారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంత అభివృద్దికి ఎంతో కృషి చేశారని చెప్పారు. అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.  జీసీసీ దళారీ వ్యవస్థగా మారిపోయిందని తెలిపారు.

కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఏపీని రెండు కాదు మూడు రాష్ట్రాలుగా చేయాలని కంకణం కట్టుకొని చెబుతుండడం దారుణమని చెప్పారు. బొబ్బిలి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి బేబి నాయన మాట్లాడుతూ వైస్సార్ బ్రతికి ఉంటే విభజన జరిగేది కాదని చెప్పారు.  చంద్రబాబును రెండు సార్లు ప్రజలు ఓడించినా సిగ్గురాలేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందుతుందని  వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద రెడ్డి, మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, జెడ్పీ మాజీ చైర్మన్, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త వంజంగి కాంతమ్మ, మాడుగుల సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, ఎస్‌కోట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు చినరాంనాయుడు, సుబ్బరాజు, సీఈసీ సభ్యుడు పీవీఎస్‌ఎన్‌రాజు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు బిబి. జగ్గన్న, శోభ వీరభద్రరాజు, పాంగి చిన్నారావు, పల్టాసింగి విజయ్‌కుమార్, పొద్దు అమ్మన్న, దూరు గంగన్నదొర, పాగి అప్పారావు, సొనాయి కృష్ణారావు, పట్టాసి కొండలరావు, కొర్రా కాసులమ్మ, వచ్చంగి పద్మ, రాందాస్, రవణమూర్తి, వెచ్చంగి కొండయ్య, దురియా రుక్మిణి, 56 మంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు

సమైక్య శంఖారావం బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఆద్వర్యంలో అలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ బృందం వేదికపై నృత్యాలు చేస్తూ పాడుతూ ఉంటే సభలో ఉన్న  గిరిజనం  కేరింతలు కొట్టారు. రెండు ప్రసంగాలకు మధ్య సాంస్కృతిక బృందం పాటలు పాడుతూ జనాన్ని ఉత్సాహపరిచారు.
 
పార్టీలో పలువురు చేరిక : శంఖారావం సభలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన  పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారిలో  టీడీపీ మాడగడ మాజీ సర్పంచ్, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన సొనాయి బజ్జింగు, అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రేగబోయిన స్వామి, వాలసి, శిరగాం, కివర్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీలోకి చేరా రు.  వీరికి దాడి వీరభద్రరావు, అరకు నియోజక వర్గం సమన్వయకర్త కుంభా రవిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 

మరిన్ని వార్తలు