మోసం చేశాడు.. కాదు బ్లాక్‌మెయిల్ చేస్తోంది!

22 Nov, 2013 03:20 IST|Sakshi

=స్నేహితుడి ఇంటి ముందు స్నేహితురాలి ధర్నా
 =బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ స్నేహితుడి ఆత్మహత్యాయత్నం

 
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్ : ప్రేమపేరుతో నమ్మించి, ఇప్పుడే మో తనకు సంబంధం లేదని తప్పించుకుంటున్నాడంటూ స్నేహితురాలు అత ని ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆ మె బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ స్నేహితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మదనపల్లెలో కలకలం రేపింది. స్నేహితురాలి కథనం మేరకు.. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన ఇమాంసాహెబ్, మెహతాజ్ దంపతులు 8 నెలల క్రితం రామారావుకాలనీలోని అన్వర్ ఇంటిలో అద్దెకు దిగారు.

ఆరునెలల క్రితం అన్వర్ కుమారుడు మహ్మద్(25) ఇమాం సాహెబ్ కుమార్తె షబీనా(20)ను ప్రేమిస్తున్నానంటూ వెంట ప డ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటాడు క దా అని షబీనా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా మిన్నకుండిపోయింది. ఇదిలావుండగా రెండునెలల క్రి తం ఇమాంసాహెబ్ కుటుంబం చంద్రాకాలనీకి మారిపోయింది. షబీనాకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటుండగా తాను మహ్మద్‌ను ప్రేమిస్తున్న ట్లు ఇంట్లో చెప్పింది. దీంతో వారు మహ్మద్ ఇంటికి వెళ్లి పెళ్లి సంబం ధం మాట్లాడారు. వారు లక్షల్లో కట్నం డిమాండ్ చేయడంతో మిన్నకుండిపోయారు.

తిరిగి రెండు రోజులక్రితం షబీనాకు పెళ్లి సంబంధాలు చూశారు. దీంతో ఆమె గురువారం తల్లిదండ్రుల తో గొడవపెట్టుకుంది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని పట్టుబట్టింది. షబీనాను తల్లిదండ్రులు ఇం ట్లోంచి గెంటేశారు. దీంతో ఆమె స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్లింది. మహ్మద్ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఇక చేసేది లేక ఆమె అక్కడే ధర్నా కు దిగింది. ఏమి చేయాలో పాలుపోని అన్వర్ కుటుంబసభ్యులు మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసుకుని సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. షబీనా అ క్కడే కూర్చొండిపోవడంతో విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి కవరేజి చేశారు.
 
మహ్మద్ ఆత్మహత్యాయత్నం

షబీనా తన ఇంటిముందు ధర్నా చేస్తూ తనపై లేనిపోనివి మీడియాకు చెబుతోందని మనస్తాపం చెందిన మహ్మద్  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకెలాంటి సం బంధం లేదని, షబీనా కావాలనే తనను బ్లాక్‌మెయిల్ చేస్తోం దంటూ పోలీసులకు వాగ్మూలం ఇచ్చా డు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. టుటౌన్ సీఐ సీఎం.గంగయ్య బాధితున్ని పరామర్శించారు. షబీనా వాగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. అనంతరం ధర్నా చేస్తున్న షబీనాను స్టేషన్‌కు పిలిపిం చారు. ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు.
 

మరిన్ని వార్తలు