హెడ్‌మాస్టర్ సస్పెన్షన్

21 Jan, 2014 02:30 IST|Sakshi

 చక్రాయపేట, న్యూస్‌లైన్: కీచక హెడ్‌మాస్టర్ కృష్ణానాయక్‌ను డీఈఓ అంజయ్య సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. చక్రాయపేట మండలం  మహదేవపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కృష్ణానాయక్ తోటి ఉపాధ్యాయురాలి పట్ల, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై వారు ఆదివారం పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  ఈ విషయంపై ఆదివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కృష్ణానాయక్‌ను సస్పెండ్ చేస్తామని డీఈఓ ఆదివారం విద్యార్థుల వద్దకు వచ్చి హామీ ఇచ్చారు. కాగా సోమవారం విద్యార్థులు పాఠశాలకు మధ్యాహ్నం వరకు తాళాలు వేసి బయటనే కూర్చున్నారు. హెడ్మాస్టర్‌పై చర్యలు తీసుకునేంతవరకూ పాఠశాల తలుపులు తీయమని విద్యార్థులు తెగేసి చెప్పారు.

 మధ్యాహ్నం హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు మండల విద్యాకేంద్రానికి వచ్చాయని ఆ పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు చెప్పినా వారు వినలేదు. దీంతో  ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎమ్మార్సీ కార్యాలయం వద్దకు వచ్చి సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకెళ్లి విద్యార్థులకు చూపించడంతో వారు కేకలు వేస్తూ తరగతి గదుల్లోకి వెళ్లారు.

 కృష్ణానాయక్‌ను రిమాండ్‌కు తరలింపు...
 హెడ్మాస్టర్ కృష్ణానాయక్‌ను సోమవారం లక్కిరెడ్డిపల్లె మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించి నట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.  మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయన్ను రాయచోటి సబ్‌జైల్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు