ఎలాంటి స‌మ‌స్య‌లున్నా నాకు ఫోన్ చేయండి : మ‌ంత్రి

11 Jul, 2020 14:15 IST|Sakshi

సాక్షి, ప‌శ్చిమ‌గోదావ‌రి : క‌రోనా నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఏలూరు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయ‌క్ స‌హా ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా  ఏలూరు ఆశ్రమ్, తాడేపల్లిగూడెం, భీమవరం లోని కోవిడ్ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల‌తో  మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా భోజ‌నం నాణ్య‌త లేద‌ని, దుప్ప‌ట్లు ఇవ్వ‌డం లేద‌ని, బాత్‌రూమ్‌లు స‌రిగా శుభ్రం చేయ‌డం లేద‌ని  బాధితులు ఫిర్యాదు చేశారు. త‌క్ష‌ణ‌మే స్పందించిన మంత్రి స‌మ‌స్య‌లల‌ను ప‌రిష్క‌రించాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించారు.
(బాబు తీరు రాజకీయాలకే మచ్చ)

అంతేకాకుండా కోవిడ్ ఆసుప‌త్రుల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా 18002331077 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కు, లేదా నేరుగా నా నెంబ‌ర్‌కు  ఫోన్ చేయండంటూ మంత్రి పేర్కొన్నారు. ప్ర‌తిరోజూ 500 రూపాయ‌లు వెచ్చించి ప్ర‌తీ కరోనా రోగుల‌కు పౌష్టికాహారం అందించేలా సీఎం జ‌గ‌న్ ఆదేశించార‌ని మంత్రి గుర్తుచేశారు. కోవిడ్ సెంట‌ర్ల‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. సోమ‌వారం నుంచి ఏలూరులోని 71 హాట్ స్పాట్‌ల‌లో ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే వేగంగా టెస్టులు నిర్వ‌హించి ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వారిని వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లో ప్ర‌త్యేక ఆసుప‌త్రిలో ఉంచాల‌ని ఆళ్ల నాని ఆదేశించారు. (‘సీఎం జగన్‌ నిర్ణయంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు’)


 

మరిన్ని వార్తలు