భక్తులతో కిటకిటలాడిన శ్రీశైల క్షేత్రం

7 Sep, 2015 22:26 IST|Sakshi

శ్రీశైలం (కర్నూలు): శ్రీశైల దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో దాదాపు 90వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించేందుకు దూర(లఘు) దర్శనం ఏర్పాటు చేశారు. అయితే మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో వందల సంఖ్యలో భక్తులు రుద్రాభిషేకం టికెట్లను కొనుగోలు చేశారు.

 

దాదాపు 1,300 పైగా అభిషేకాలను గర్భాలయంలో నిర్వహించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. కాగా, ఈ నెల 13తో శ్రావణమాసం ముగుస్తుందని.. చివరి శని, ఆదివారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెల్లడించారు.

మరిన్ని వార్తలు