కృష్ణమ్మ ఉగ్రరూపం

25 Oct, 2019 04:28 IST|Sakshi

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/తాడేపల్లి రూరల్‌: పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. ప్రధాన ఉప నది తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో శ్రీశైలం జలాశయంలోకి గురువారం సాయంత్రం ఆరు గంటలకు 6.68 లక్షల క్యూసెక్కులు ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు 30 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పది గేట్లు 24 అడుగుల మేర ఎత్తి రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 5.95 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సాగర్‌లోకి 5.77 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి, ఎడమ కాలువలకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, సాగర్‌ 26 గేట్లు ఎత్తి 5.87 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 6.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.

ఇక్కడకు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో దానిని నియంత్రిస్తూ నదీ తీర ప్రాంత ప్రజలను ముంపు బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా.. ప్రకాశం బ్యారేజీలోకి 4.80 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరికను అధికారులు ఎగురవేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 5.12 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రికి ఆరు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం 5.66 లక్షలకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మొత్తం మీద ఈ సీజన్‌లో గురువారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 604.68 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. 

ప్రమాదకరంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు..
బ్యారేజికి గత 75 రోజుల నుంచి తరచూ వరదలు వస్తుండడంతో గేట్లలో లోపాలు బయటపడుతున్నాయి. గురువారం 5లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద రావడంతో సీతానగరం వైపు ఉన్న అండర్‌ స్లూయిస్‌ గేట్ల మీద నుంచి నీళ్లు పొర్లాయి. ఈ ఒత్తిడికి అండర్‌ స్లూయిస్‌ గేట్లలో 7వ గేటు వద్ద చెయిన్‌ లింక్‌ తప్పి నీళ్లలో వేలాడుతోంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీపీఏల్లో టీడీపీ భారీ అక్రమాలు

డిసెంబర్‌ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు

గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు

బాలయ్యా..రోడ్డు ఎక్కడయ్యా? 

పెట్రో కెమికల్‌ కారిడార్‌తో భారీ పెట్టుబడులు

ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా?

చేనేతలకు కొండంత అండ

యువశక్తి సద్వినియోగంతోనే దేశాభివృద్ధి

తుది అంకానికి ఆమోదం

కనీస వసతులు లేకుండా హైకోర్టు ఏర్పాటు చేస్తారా?

ఆర్టీసీ వీలీనంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీలో అర్చక పరీక్ష ఫలితాలు విడుదల

'జిల్లా అభివృద్ధే ద్యేయంగా కృషి చేయాలి'

అదుపుతప్పిన లారీ; ఒకరి మృతి

వైఎస్‌ జగన్‌ నివాసానికి సదానందగౌడ

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌

భారీ వర్షాలు; అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

సాగు సంబరం

ఆ వార్తలను ఖండిస్తున్నా: బాలినేని

సంక్షేమ పథకాలే అజెండా..

ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...

అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట

సూరంపల్లిలో ‘సీపెట్‌’  ప్రారంభం

ఆయనే దొంగ లెక్కలు సృష్టించాడా మరి! 

కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం

బస్సులో రచ్చ, టీడీపీ నేతబంధువు వీరంగం

వణికిస్తున్న వర్షాలు

బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జాబిలమ్మ ముస్తాబు

సంగీతంలో సస్పెన్స్‌

రాజమండ్రికి భీష్మ

చలో కేరళ

మరో రీమేక్‌లో...

మీటూ మార్పు తెచ్చింది