శ్రీశైలం డ్యామ్ కు భారీగా చేరుతున్న వరద నీరు

8 Aug, 2019 13:24 IST|Sakshi

నాగార్జున సాగర్‌ జలాశయాలకు నీరు విడుదల

సాక్షి, కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 3,04,097 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా, శ్రీశైలం డ్యామ్ కు 3,47,199 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మొత్తం ఔట్‌ ఫ్లో 96,210 గా నమోదయింది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.30 అడుగులు కొనసాగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 165.1436 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం 96,210 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ జలాశయాలకు విడుదల చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు