శ్రీశైలానికి భారీగా వరద నీరు

28 Sep, 2015 18:52 IST|Sakshi

ఎగువన వర్షపాతం నమోదు కావడంతో.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరీవాహకప్రాంతాలైన జూరాల, తుంగభద్రల నుంచి శ్రీశైల జలాశయానికి సోమవారం  వరద ప్రవాహం మొదలైంది. జూరాల నుంచి 6వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 4,479 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. రెండు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేసిన విషయం తెల్సిందే. జలాశయ పరిసర ప్రాంతాలలో 1.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 62.94 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 840.70 అడుగులకు చేరుకుంది.
 

మరిన్ని వార్తలు