అల్పపీడనం తీవ్రంగా మారే అవకాశం

3 Sep, 2019 14:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని మంగళవారం వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్రలో విస్తరంగా వర్షాలు పడే అవకాశం ఉందని  ఐఎండీ వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతవరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు